UPIపై ప్రతిపాదిత 0.4% MDR ఛార్జీలను సోషలిస్ట్ పార్టీ (ఇండియా) తీవ్రంగా వ్యతిరేకిస్తోంది*

₹2,000 పైబడిన UPI లావాదేవీలపై Merchant Discount Rate (MDR) విధించే ప్రతిపాదన చిన్న వ్యాపారులు, చిరు వర్తకులు మరియు సామాన్య ప్రజలపై అదనపు ఆర్థిక భారాన్ని మోపే అవకాశం ఉంది. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించాల్సిన సమయంలో కొత్త ఛార్జీల విధానం ప్రజలకు మరింత భారంగా మారకూడదు.

మా ప్రధాన డిమాండ్లు:

  • UPI Merchant లావాదేవీలపై ప్రతిపాదిత MDR ఛార్జీలను తక్షణమే ఉపసంహరించాలి.
  • చిన్న వ్యాపారులు, చిరు వర్తకులపై అదనపు ఆర్థిక భారం మోపకూడదు.
  • UPIని తక్కువ ఖర్చుతో, సులభంగా ప్రజలకు అందుబాటులో ఉంచాలి.
  • కొత్త ఛార్జీలకు ముందు వ్యాపారులు, వినియోగదారులు, ప్రజా ప్రతినిధులతో విస్తృత సంప్రదింపులు జరపాలి.

ప్రజల సౌకర్యం కోసం డిజిటల్ చెల్లింపులు – అదనపు భారాల కోసం కాదు!

— డా. తోటకూర హరీష్ స్వామి కుమార్

జాతీయ కార్యదర్శి,

జాతీయ అధికార ప్రతినిధి,

*సోషలిస్ట్ పార్టీ (ఇండియా)*


Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *